Ram Charan: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చివరగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డును సైతం అందుకున్నారు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా త్వరలో అనగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీకి మరొక ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది.
దాంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చెర్రీ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే.. తాజాగా నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. కాగా మొదట గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్ల అనుకున్నారట. అందులో రామ్ చరణ్ రెమ్యునరేషన్‌నే దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరిగింది. చరణ్ కూడా ముందే అంతే స్థాయిలో తీసుకుంటానని చెప్పారట. కానీ బడ్జెట్ పెరగడంతో రెమ్యునరేషన్ తగ్గించారట. ఈ సినిమాకు మొత్తంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.
షూటింగ్ ఆలస్యం కావడంతోనే బడ్జెట్ పెరిగింది.రామ్ చరణ్‌కు మొదటి నుంచి ఒక అలవాటు ఉందట. సినిమా ఒప్పుకున్న వెంటనే రెమ్యునరేషన్ తీసుకోడట. షూటింగ్ మొత్తం పూర్తయిన చెప్పిన అమౌంట్ తీసుకుంటాడు. గేమ్ ఛేంజర్ విషయంలోనూ రామ్ చరణ్ అదే ఫాలో అయ్యాడు. తొలుత రూ. 100 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. కానీ బడ్జెట్ పెరగడంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా పుచ్చుకున్నారట. ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ చిత్రానికి అది చాలా తక్కువ రెమ్యునరేషనే. శంకర్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించి రూ. 35 కోట్లతో సరిపెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై ఇంకా నిజానిజాలు రావాల్సి ఉంది.