JC Prabhakar Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో జెసి బ్రదర్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇటీవల కాలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తరచు మీడియా సమావేశాలలో మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే తాజాగా ఈయన మరో వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో ఈయన కూటమి నేతలపై విమర్శలు కురిపిస్తూ జగన్ మంచోడంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
ఇలా జేసీ నోట జగన్ మంచోడనే మాట రావడంతో ఒక్కసారిగా కూటమి నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి జెసి జగన్ పై ప్రశంసల కురిపించడానికి గల కారణం ఏంటి అసలు ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే… ఇటీవల అనంతపురంలోని దివాకర్ ట్రావెల్ బస్సు మంటలలో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఇలా ఒక బస్సు మొత్తం కాలిపోగా మరొక బస్సు సగం వరకు కాలిపోయింది అయితే ఈ ఘటనలో ఎవరి హస్తమైన ఉందా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇలా బస్సు దగ్ధం అయినటువంటి ఘటన గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నా బస్సు కాల్చారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా ఇవ్వను. ఏం చేస్తారు ఒరేయ్ జగనే మేలు రా.. కేవలం నా బస్సులు మాత్రమే ఆపినాడు మీ బీజేపీ వాళ్లు లాగా నా బస్సులను కాల్చలేదు అంటూ ఫైర్ అయ్యారు.
ఇంతకన్నా నీచం మరొకటి లేదు జగన్ రెడ్డి చాలా మంచోడు… నా బస్సులను మాత్రమే నిలబెట్టినాడు కానీ ఎప్పుడూ ఇలా కాల్పించలేదని జగన్ పై ప్రశంశలు కురిపించారు.. అప్పుడు 300 పోయినాయి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆరోజు పది లక్షల పోతే నేడు ఆరు లక్షల పోయాయి. జగన్ మంచోడు మీలా బస్సులను కాల్పించలేదు. మీరు నా ఒక బస్సు కాల్చేస్తే నేను భయపడతానా అసలు భయపడను బస్సులన్ని లైన్లో నిలబెట్టాను అన్ని కాల్చుకోండి భయపడేది లేదని ఈయన తెలిపారు.
ఆ బస్సును నా డ్రైవర్ కు నేను ఇచ్చాను. ఇన్ని రోజులు నా దగ్గర పని చేశాడు కాబట్టి ఆ బస్సును ఐదు లక్షలకే నా డ్రైవర్ కి ఇచ్చి నడుపుకోమని చెప్పాను. మీ చర్యల వల్ల ఒకరి జీవితాన్ని నాశనం చేశారు అంటూ బస్సు ఘటనపై జెసి దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఈ బస్సు కాలిపోవడం వెనుక బిజెపి హస్తం ఉందని స్పష్టం అవుతుంది.
తాడిపత్రిలో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
మీకన్నా జగన్ రెడ్డినే మేలు కదరా. బీజేపీ వాళ్ళ లాగా జగన్ ఎప్పుడూ నా బస్సులు తగలబెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు…ఇప్పుడేందుకు బాధ పడతాను ? నా… pic.twitter.com/QFZ0UpZQhr
— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2025