YS Jagan: జగన్ రెడ్డిలో మొదలైన భయం…. ఈ గండం నుంచి బయటపడగలరా?

YS Jagan: వైకాపా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ పరంగా భయం మొదలైందని తెలుస్తుంది. ఈయన 2019 ఎన్నికలలో సింగిల్ గా పోటీ చేసి ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా గత ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్ గత ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో ఎంతోమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిలో ఏదో తెలియని భయం మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడప్పుడే కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితులు ఏమాత్రం లేవని స్పష్టమవుతుంది. అదేవిధంగా బీజేపీతో అయినా సఖ్యత కొనసాగిద్దాం అంటే ప్రస్తుతం జనసేన తెలుగుదేశం బిజెపితో కూటమిగా ఏర్పడ్డాయి. అలాగే మరోవైపు వైకాపాకు చెందిన ఎంతోమంది కీలక నేతలు పార్టీని వీడి వదిలి వెళ్ళిపోతున్నారు.

ఇలా వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం జగన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న తనకు మాత్రం సరైన దారి కనిపించలేదని తెలుస్తుంది. దీంతో ఒకవేళ జెమిలి ఎన్నికలు కనుక వస్తే తన పార్టీ పరిస్థితి ఏంటి అనే భయం జగన్మోహన్ రెడ్డిలో మొదలైందని తెలుస్తోంది. జగన్ కు ఇప్పుడు బీజేపీ నేరుగా సాయం అందించే పరిస్థితుల్లో మాత్రం లేదు. అధికారంలో లేకపోవడంతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నుంచి మద్దతు పుష్కలంగా ఉండటంతో జగన్ ను పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి కారణంగా బిజెపికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోయింది తద్వారా బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకుంటే పర్లేదు కానీ ఇలాగే కొనసాగితే మాత్రం ఈయన వచ్చే ఎన్నికలలో కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుందని వచ్చే ఎన్నికలలో ఓడిపోతే ఇక తన పార్టీని ఇతర పార్టీలలోకి విలీనం చేయాల్సిన పరిస్థితిలో ఏర్పడతాయని స్పష్టమవుతుంది.