AP: ఎన్నికల ప్రచార సమయంలో కూటమి పార్టీలు కొన్ని పథకాలను ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం ఒకటి. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఇంట్లో ఒకరికి అమ్మ ఒడి పథకం ద్వారా 15 వేల రూపాయలను నేరుగా తల్లి ఖాతాలో జమ చేశారు. ఇక ఇదే పథకాన్ని పేరు మార్చి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారందరికీ కూడా 15వేల రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తాము అంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.
ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అర్హులైన వారందరికీ కూడా 15000 రూపాయలను జమ చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు అవుతున్న ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకం గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తల్లికి వందనం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నట్లు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.. ఈ పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థినికి 15000 రూపాయలను నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు.
ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ఎన్డిఏ కూటమి హామీ ఇచ్చారు. ఇక వచ్చే ఏడాది ఈ పథకం అమలు చేయడం కోసం విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.