Ambanti: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను కక్షపూరిత రాజకీయాలు చేయలేదని అలా చేసి ఉంటే కనుక నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లేవాడు అంటూ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి అనుకూల మీడియా అయినటువంటి కొన్ని పచ్చపత్రికలలో నాకు కక్ష సాధింపు లేదు అంటూ పెద్ద అక్షరాలతో రాసిన రాతలు చూసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని తెలిపారు. చంద్రబాబు తడి గుడ్డతో గొంతు కోసే రకం అంటూ ఆయన పై విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు మాటలు కనక వింటే అదేదో సినిమాలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు చంద్రబాబు నాయుడు మాటలకు కూడా అర్థాలే వేరే ఉంటాయని ఆయన అవునంటే కాదని కాదంటే అవునని అర్థం అంటూ అంబంటి విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడారు అంటే దానికి వ్యతిరేకంగా మనం అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈయన కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదంటే అందరికీ ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. అధికారంలోకి రాగానే వైకాపా నేతలు కార్యకర్తలపై పచ్చ తమ్ముళ్లు చేసిన దాడులు మన కళ్లకు స్పష్టంగా కనిపించాయి.చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కక్షలు, కుట్రలు, మోసాలతోనే నిండి ఉందని అన్నారు.
ఈ దేశంలోనే రాజకీయాల్లో అత్యంత విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు మాత్రమేనని అంబంటి రాంబాబు విమర్శలు కురిపించారు. ఆయన రాజకీయాలన్నీ కూడా తప్పుడు హామీలు మోసపూరిత హామీలతోనే ఉంటాయని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ అంబటి విమర్శలు కురిపించారు.