Sai pallavi: 2024 పూర్తి కావడంతో కొత్త సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ఎంతోమంది సాధారణ ప్రజలు అలాగే సినిమా సెలబ్రిటీలు కూడా ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇక సినిమా సెలబ్రెటీల విషయానికి వస్తే సెలబ్రిటీలు అందరూ కూడా వారి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెళ్లి అక్కడ న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు వారి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి సాయి పల్లవి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈమె అందరికంటే కూడా చాలా భిన్నంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారని చెప్పాలి. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈమె ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో ప్రార్థనలను నిర్వహిస్తూ ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
ఇలా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈమె సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పట్టు చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయపద్ధంగా ఈ వేడుకలలో సాయి పల్లవి పాల్గొనడం చూసిన అభిమానులు ఈమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఇలా సింపుల్గా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు అయితే సాయి పల్లవి ఇప్పుడు మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇలా పుట్టపర్తికి వెళ్లి అక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పుట్టపర్తి సాయిబాబాకు తన తల్లి నమస్కరించిన తర్వాతనే తాను జన్మించానని అందుకే తన పేరులో సాయి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టినట్లు కూడా ఈమె తెలిపారు.
Our Sai Pallavi today evening at Satya Sai’s Mangala Aarati program 🥹✨♥️@Sai_Pallavi92 #SaiPallavi #NewYearCelebration pic.twitter.com/KZKncToDwF
— Saipallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) January 1, 2025