YS Sharmila: గత కొంతకాలంగా జగన్ వర్సెస్ షర్మిల అనే విధంగా వివాదాలు చోటు చేసుకున్నాయి కేవలం వారి కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలను షర్మిల రాజకీయపరంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ రచ్చ చేశారు. ఈమె ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి తన అన్నయ్యను టార్గెట్ చేస్తూ తన అన్న జగన్ మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున విమర్శిస్తూ వచ్చారు.
ఇలా షర్మిల వ్యవహరించే తీరు ఆ పార్టీ సీనియర్ నాయకులకు ఏమాత్రం నచ్చలేదు దీంతో షర్మిల వ్యవహార శైలిపై హై కమాండ్ కు సీనియర్ నాయకులు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం పీసీసీ పదవి నుంచి షర్మిలను తప్పించి మరొకరికి ఆ అవకాశం కల్పించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఏ విషయం గురించి అయినా ఘాటుగా స్పందిస్తూ అందులో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి షర్మిల ముందు వరుసలో ఉండేవారు అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకి కూడా ఈమె పూర్తిగా దూరంగా ఉన్నారు.
క్రిస్మస్ పండుగను కూడా కేవలం తన భర్త కొడుకు కోడలు కూతురుతో మాత్రమే కలిసి జరుపుకున్నారు ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈమె సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు చేయలేదు. అయితే క్రిస్మస్ వేడుకలలో మాత్రం వైఎస్ విజయమ్మ తన కొడుకు కోడలు మనవరాళ్లతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విధంగా వైఎస్ విజయమ్మ తన కూతురి కారణంగా తన కొడుకుకి ఎలాంటి ఇబ్బంది తలెత్తుతుందో పూర్తిగా గ్రహించారని అందుకే తన కొడుకు చెంతకు చేరి తన కుటుంబాన్ని మొత్తం ఏకధాటిపై నడిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా షర్మిలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె కూడా మౌనం పాటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమయ్యారని అందుకే ఏపీలో కూడా తాను చెప్పిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షర్మిల మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తుంది.