YS Jagan: గత ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని ఏలిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలలో మాత్రం ఊహించని పరాజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. 151 స్థానాలలో సింగిల్ గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇలా కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంది అయితే ఈ ఆరు నెలల కాలంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై వ్యతిరేక పోరాటానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే సంక్రాంతి తర్వాత తాను ప్రతి ఒక్క జిల్లాకు వెళ్లి రెండు రోజులపాటు జిల్లాలోనే నిద్ర చేస్తూ అక్కడ సమస్యలను అడిగి తెలుసుకుంటానని తిరిగి జనంలోకి రాబోతున్నానని ఇటీవల ఈయన వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి జగనన్న విత్ కేడర్ అని నామకరణం కూడా చేశారు. అయితే సంక్రాంతి తర్వాత ప్రజలలోకి జగన్ రాబోతున్న నేపథ్యంలో పార్టీ నేతల నుంచి క్యాడర్ నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని తెలుస్తుంది.
ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ నిత్యం ప్రజలలో తిరుగుతూ తనకు ఒక అవకాశం కల్పించండి అని కోరారు దీంతో ప్రజలు ఆయనకు ఏకంగా 151 స్థానాలలో విజయం అందించారు. అయితే గెలిచిన తర్వాత ఏ రోజు కూడా ప్రజల కోసం నాయకుల కోసం జగన్ బయటకు వచ్చింది లేదు కేవలం ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి మాత్రమే పరిమితమయ్యారు.
ఇక జగన్ బయటకు రావాలి అంటే సొంత పార్టీ నేతలు పెద్ద ఎత్తున జనాలను తరలించి సభకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక జగన్ కి వచ్చి రాగానే అక్కడి నుంచి ప్రజలు వెళ్లిపోయేవారు. ఇక సిద్ధం సభలకు జగన్ వచ్చిన చుట్టూ పరదాలు కట్టుకొని జనాల మొహం కూడా చూడకుండా ఈయన బటన్ నొక్కి వెళ్ళిపోయేవారు. ఇలా జగన్ సభ పెడుతున్నారు అంటే పార్టీ నేతలలోనూ కార్యకర్తలలోనూ భయం పుట్టుకు వచ్చేది.
ఇక ఏకంగా ఇప్పుడు ఘోరంగా ఓటమిపాలు అయిన తరువాత ఆరు నెలలకే జగన్ జనంలోకి వస్తానని చెప్పడంతో నాయకుల నుంచి ఏ మాత్రం స్పందన లేకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఇలా తన పర్యటనకు స్పందన లేకుండా పర్యటనలు చేస్తే పరువు మొత్తం పోతుందని భావించిన జగన్ లండన్ పర్యటనకు వెళుతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు అంటూ బయటకు చెబుతున్నారు.