Dil Raju: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను పూర్తిగా పక్కదోవ పట్టించడం కోసమే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి అల్లు అర్జున్ ఎపిసోడ్ మొత్తం నడిపించారంటూ బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఈయన సినిమాలకు రేట్లు తగ్గించడం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం వంటివి జరిగాయి.
ఇకపోతే గతంలో తెలంగాణ ప్రభుత్వ తీరును సినిమా ఇండస్ట్రీ మొత్తం తప్పు పట్టారు. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేసినప్పుడు, సమంత నాగచైతన్యల గురించి కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ మొత్తం స్పందించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ విధంగా ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కొంతమంది సెలబ్రిటీలు నేడు రేవంత్ రెడ్డిని కలిసి శాలువాలు కప్పి మరి సన్మానం చేశారు.
ఇక కొండాసురేఖను విమర్శించిన వారిలో దిల్ రాజు కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు దిల్ రాజు ఏకంగా తెలంగాణ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలను కూడా తీసుకోవడం కోసం మెరుపు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులపైనే ఇప్పుడు దిల్ రాజు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఈయన సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మీ రాజకీయాల కోసం సినిమా పరిశ్రమను వాడుకోవద్దండి అంటూ చెప్పకనే చెప్పేశారు. దీంతో బిఆర్ఎస్ నాయకులు సైతం విమర్శల కురిపిస్తున్నారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకు అండగా బిఆర్ఎస్ నిలబడింది. అలాంటిది ఇప్పుడు దిల్ రాజు తమ పార్టీ నాయకుల గురించి విమర్శలు చేయడం సరి కాదని తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు కాస్త డీల్ రాజుగా మారిపోయారు అంటూ బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.