కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనేక చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం మొదటి నెలలోనే అనేక సినిమాలు విడుదల కానున్నాయి. అందులో మొదటిది కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్.ఈ పొలిటికల్ డ్రామా 10 జనవరి 2025న విడుదల కానుంది.తర్వాత బాబీ, బాలయ్య కాంబినేషన్లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై తెరకెక్కిన డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లోకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న గ్రాండ్ గా అమెరికాలో ప్లాన్ చేసింది టీమ్.జనవరి 14న రిలీజ్ అవుతోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా.
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుంది.నాగచైతన్య, సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్లో చందూ మొండేటి డైరెక్షన్లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది తండేల్ . ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కి సిద్ధమవుతుంది.విశ్వక్ సేన్ ఫీమేల్ రోల్ లో చేస్తున్న లైలా ఫిబ్రవరి 14 కి డేట్ ఫిక్స్ చేసుకుంది. నితిన్ తమ్ముడు సినిమా కూడా ఫిబ్రవరి 14కే వస్తున్నట్టు సమాచారం.పవన్ కళ్యాణ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 300కోట్లతో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ హరిహరవీరమల్లు సినిమా మార్చ్ 28న విడుదల కాబోతుంది.
ఇదే రోజు గౌతమ్ తిననూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. సీనియర్ స్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాని మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు.మారుతి, ప్రభాస్ కాంబినేషన్లో 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.సిద్దు జొన్నలగడ్డ సినిమా జాక్ అదేరోజు రిలీజ్ డేట్ ఇచ్చేసింది.ఏప్రిల్ 18న అనుష్క , క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఘాటి, తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుంది.మే ఫస్ట్ న నాని హిట్ 3 సినిమా రిలీజ్ అవుతోంది.
రవితేజ మాస్ జాతర మూవీ కూడా మే 9వ తేదీ రిలీజ్ అవుతోంది. వీటితోపాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు రెట్రో, కూలీ కూడా ఈ నెలలోనే విడుదలవుతాయి.జూన్ లో కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా రానుంది. సెప్టెంబర్ 25న మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 థియేటర్లోకొస్తోంది.అదే రోజు సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సంబరాలఏటిగట్టు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీం.అక్టోబర్ 2న రిషబ్ శెట్టి హీరోగా కాంతార కి ప్రీక్వెల్ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న విజయ్ 69 మూవీ అక్టోబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది ఇవి కాకుండా ఇంకా చిన్న చితక సినిమాలు చాలానే 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.