Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోను పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. సత్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించారు అయితే ఇలా ఆ మహిళ మరణించడానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు ఏకంగా ఆయనని అరెస్టు చేసి ఒకరోజు మొత్తం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పూర్తిగా తప్పు పట్టారు.
ఇక ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవడంతో సినిమా సెలబ్రిటీలు సైతం వెనకడుగు వేశారు ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని అదే విధంగా సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలని అల్లు అర్జున్ పై అసెంబ్లీలో విమర్శలు కురిపించారు. అనంతరం అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ఇలా ఈ వ్యవహారం కాస్త తారస్థాయికి చేరుకుంది. అయితే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు చేయించారంటూ కూడా కొందరి విమర్శలు చేశారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది సీఎంలు అవినీతికి పాల్పడి అందరికీ తెలిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరికీ తెలిశారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతూ ఈయన పాన్ ఇండియా సీఎంగా గుర్తింపు పొందారని కిరణ్ కుమార్ తెలిపారు. రేవంత్ రెడ్డి తనకు ఎవరిపైనా పక్షపాతం లేదని, చట్ట ప్రకారం నడుచుకున్నానని అసెంబ్లీలో వివరించారనీ కిరణ్ కుమార్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.