నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా విషెస్ చెప్పిన స్టార్ హీరోలు!

2024 కి వీడ్కోలు పలికి 2025 కి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు చెప్పుకోవటం సర్వసాధారణం. స్టార్ హీరోలు కూడా తమ అభిమానులకి శుభాకాంక్షలు చెప్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే వారు విదేశాల్లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోలు చాలామంది విదేశాలలోనే ఉన్నారు. అయితే కొందరు స్టార్ నటులు తమ అభిమానులకు ఏ విధంగా శుభాకాంక్షలు తెలిపారో ఇక్కడ చూద్దాం. సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా డిఫరెంట్ గా న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.

తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో ఆయన ఇలా అన్నారు: మంచివాళ్ళని దేవుడు పరీక్షిస్తాడు. వదిలిపెట్టడు. చెడ్డవాళ్ళకి దేవుడు చాలా ఇస్తాడు కానీ వదిలేస్తాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. ఇది రజినీకాంత్ నటించిన బాషా సినిమాలోని డైలాగ్. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ ఏడాది మీకు మరింత ఆనందాన్ని విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం లండన్ లో ఫ్యామిలీతో కలిపి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నాచురల్ స్టార్ నాని కూడా వెరైటీగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. కొత్త సంవత్సరం కానుకగా సాలిడ్ పోస్టర్ తో అందరికీ విషెస్ ని తెలిపాడు. ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ మీసాలు దువ్వుతున్న అర్జున్ సర్కార్ లా నాని ఇందులో అదరగొట్టాడు అని చెప్పాలి. దీనితో ఈ పోస్టర్ చూసిన తన ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.2025లో మన కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి.

మనందరి లక్ష్యాన్ని చేరుకొనే శక్తిని 2025 అందించాలి భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతమవ్వాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా ప్రేమ, సంతోషంతో కలిసిమెలిసి ఆనందించండి’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా అభిమానులందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌. లవ్‌ యూ ఆల్‌’’ అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.