AP: ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతుల ఖాతాలో 20వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వెల్లడించింది. జనవరి రెండో తేదీ ఏపీ క్యాబినెట్ సమావేశమైన సంగతి మనకు తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపారు. ఇలా క్యాబినెట్ మీటింగ్లో సూపర్ సిక్స్ హామీల గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెన్షన్ పెంపుదల అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులపై ఇప్పటివరకు క్లారిటీ లేకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే రైతులకు రైతు భరోసా పథకం కింద 20 వేల రూపాయలను ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సూపర్ సిక్స్ హామీలలో ఒకటైనటువంటి ఈ రైతు భరోసాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతు భరోసా కింద జమ చేసే 20వేల రూపాయల గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది.
కేంద్రం ఇచ్చే పదివేల రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో 10 వేల రూపాయలను అందజేస్తూ అతి త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రైతు భరోసా మాత్రమే కాకుండా తల్లికి వందనం పేరిట ఏ కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్న వారందరికీ తల్లుల ఖాతాలో 15000 రూపాయలను జమ చేయబోతున్నారు. ఈ పథకాన్ని కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.