ఆ స్టార్ హీరోయిన్ల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కేజిఎఫ్ బ్యూటీ..!

తను నటించిన ఒక్క సినిమా ద్వారా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు వారి నటించిన సినిమాలు హిట్ అయితే దాన్ని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్ ఉంటుంది. వారు నటించిన సినిమాలు హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి రెమ్యూనరేషన్ కొంత పెంచుతారు. సాధారణంగా అందరు నటీనటులు చేసే పని అది. ఒకేసారి ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే సినిమా ఆఫర్లు తగ్గుతాయన్న ఉద్దేశంతో కొంత రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు.

కానీ శ్రీనిధి శెట్టి మాత్రం ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ భారీ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా నార్త్ లో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో హీరో యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ కేజిఎఫ్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో శ్రీనిధి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. కేజిఎఫ్ చాప్టర్1 కన్నా
కేజిఎఫ్ చాప్టర్ 2 ద్వారా నార్త్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు పొందిన శ్రీనిధి బాలీవుడ్ హీరోయిన్ల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.

శ్రీనిధి బాలీవుడ్ హీరోయిన్ల కన్నా లక్షల్లో ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ..మీకు పేరు, ప్రఖ్యాతలు ముఖ్యమా? లేక డబ్బు ముఖ్యమా? అడిగితే నిర్మొహమాటంగా నాకు డబ్బే ముఖ్యం అని శ్రీనిధి సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న విషయం నిజమని అందరు భావిస్తున్నారు. అయితే శ్రీనిధి ఇలా భారీగా రెమ్యూనరేషన్ పెంచటం వల్ల తనకి సినిమా ఆఫర్స్ వస్తయో, లేదో చూడాలి మరి.