Vignesh Shivan: సాధారణంగా తమ జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారు వారి జీవితం గురించి అందరికీ తెలియాలని కోరుకుంటారు ఈ క్రమంలోనే సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారి జీవిత కథలను బయోపిక్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినీనటి నయనతార కూడా తన బయోపిక్ ను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరిట నయనతార జీవితం చరిత్ర మొత్తం ఇందులో రూపొందించి నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేశారు ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ప్రసారం అవ్వడమే కాకుండా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. చిన్నప్పటినుంచి నయనతార తన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇండస్ట్రీలో సాధించిన విజయం అలాగే ప్రేమ పెళ్లి పిల్లల గురించి అన్ని విషయాలను తెలిపారు.
ఇక ఈమె దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని కొంతకాలం పాటు రహస్యంగా ఉంచారు. ఎప్పుడైతే వీరి ప్రేమ విషయం బయటపడిందో అప్పట్లో ఈ జంటపై చాలా విమర్శలు వచ్చాయని ఈ డాక్యుమెంటరీలో విగ్నేష్ ఎంతో ఎమోషనల్ అవుతూ తమ ప్రేమ విషయం గురించి తెలిపారు. తనది, నయనతారది జోడీ ఎలా ఉంటుందో చెప్తూ ఒక మీమ్ వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. ఒక అందమైన అమ్మాయి వెళ్లి బీస్ట్‌లాంటి వాడిని లవ్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారని ఉంది.
ఆ మీమ్‌లో కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నట్టు ఉందని వివరించాడు. ఆ పోస్ట్ చూడగానే చాలా బాధ కలిగింది. ఇక నయనతార కూడా ఎంతో బాధపడిందని విగ్నేష్ తెలిపారు. అయితే క్రమక్రమంగా మా జోడిని ప్రజలు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ట్రోల్స్ కూడా ఆగిపోయాయని తెలియజేశారు కానీ మొదట్లో చాలా అప్సెట్ అయ్యాం అని వెల్లడించారు.బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యారు అంటూ రజినీకాంత్ ఉదాహరణను గుర్తుచేస్తూ మన జీవితంలో ఏదీ అంత తేలికగా దొరకదని ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ వెల్లడించారు.