కోలీవుడ్ లో ప్రస్తుతం ధనుష్, నయనతార ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యులో రోజుకో కొత్తకోణం బయటికి వస్తుంది. నయనతార బియాండ్ ది ఫేరిటైల్ అనే డాక్యుమెంటరీలో తన తన సినిమా క్లిప్పింగ్ వాడుకున్నందుకు 10 కోట్లు చెల్లించాల్సిందిగా కాపీరైట్ ఆక్ట్ కింద నిర్మాత, నటుడు అయిన ధనుష్ లీగల్ నోటీసులు పంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నోటీసులకి నయనతార తీవ్రస్థాయిలో మండిపడింది.నిన్ను రెండేళ్లుగా పర్మిషన్ అడిగితే ఇవ్వటం లేదు,ఇండస్ట్రీ మొత్తం తనకి సాయం చేస్తుంటే మీరు మాత్రం మీ కక్ష సాధింపులు మొదలుపెట్టారంటూ ధనుష్ పై విరుచుకు పడింది.
ఈ విషయంపై కొందరు నయనతార కి సపోర్ట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ధనుష్ కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు డబ్బు కోసం డాక్యుమెంటరీ తీశారు, ధనుష్ ఎందుకు తన సినిమా నుంచి సీన్స్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి, ధనుష్ కోలీవుడ్ కి ఎంతమంది టెక్నీషియన్లను ఆర్టిస్టులను అందించాడని ఓ వర్గం అతడిని సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ డాక్యుమెంటరీలో ఆల్మోస్ట్ 30 సెకండ్స్ దాకా ధనుష్ కి సంబంధించిన కంటెంట్ ఉండటంతో ధనుష్ ఆ డబ్బులు డిమాండ్ చేయడంలో తప్పు లేదని వెనకేసుకొస్తున్నారు.
నయన్ తన పెళ్లిని డబ్బులకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ డబ్బులు అడగకూడదా అంటూ నయనతార పై విడిచిగుపడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా నయనతార సోషల్ మీడియాలో తాజాగా మళ్లీ మరొక పోస్ట్ పెట్టింది. తన డాక్యుమెంటరీలో చాలామంది సినిమా వాళ్ళ కంటెంట్ వాడుకున్నానని అందుకు ఆ సినిమాల నిర్మాతల దగ్గర నుంచి ఎన్ఓసి ఫామ్ తీసుకొని ఆ కంటెంట్ ని కూడా వాడుకున్నానని తెలిపింది.
అడిగిన వారందరూ ఇబ్బంది ఫీలవ్వకుండా వెంటనే ఒప్పుకున్నారని అందుకు వాళ్ళందరికీ థాంక్స్ కూడా చెప్పింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మలయాళ పరిశ్రమలలో తనకి కంటెంట్ వాడుకోవటానికి అనుమతులు ఇచ్చిన నిర్మాతలందరి పేర్లు కూడా ప్రస్తావించడం గమనార్హం. అందరూ ఇచ్చారు కానీ ధనుష్ మాత్రమే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పకనే చెప్పింది నయనతార. మరి దీని మీద ధనుష్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.