తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ పై నాంపల్లి మనోరజన్ కోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ విచారణలో భాగంగా నాగార్జున, అమల, నాగచైతన్య, సుప్రియ, వెంకటేశ్వర్లు ఇప్పటికే నాంపల్లి కోర్టు ఎదుట కూడా హాజరయ్యారు. ఈ పిటిషన్ కి కౌంటర్ ఇస్తూ కొండా సురేఖ నాంపల్లి స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
దీంతో ఈరోజు ఆమె లాయర్ గురుమిత్ సింగ్ వాదనలు విన బోతున్నారు. కొద్దిరోజుల క్రితం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే నాగార్జునకు మాజీ మంత్రి కేటీఆర్ ఓ కండిషన్ పెట్టారని అందుకే నాగచైతన్య, సమంత మధ్య విడాకులు జరిగాయి అంటూ కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఈరోజు తన వాదన వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నాగర్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని ఫ్యామిలీ మానసికంగా కృంగిపోయిందని, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణ కోరారని కొండా సురేఖ చేసిన ట్వీట్ చదివి వినిపించారు.బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని చెప్పుకొచ్చారు లాయర్ అశోక్ రెడ్డి.
అయితే ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నాంపల్లి కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కొండా సురేఖ నా కుటుంబంపై మర్యాదకరంగా వ్యాఖ్యలు చేశారు రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ చేశారని ఆరోపించారు.