TV Actor: ఆ సీరియల్ నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్.. టీవి యాక్టర్ పేర్రాజు..!

TV Actor: మనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవటానికి వయసు అడ్డుగా ఉండదు. ఇలా ఎంతో మంది వయసు పైబడిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. యుక్తవయసులో ఉన్న సమయంలో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన వారు వయసు పైబడిన తర్వాత కూడా బామ్మ తాత వంటి పాత్రలో నటిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. అటువంటి వారిలో విజయనగరం జిల్లాకి చెందిన పేర్రాజు కూడా ఒకరు. వృత్తి రీత్యా ఈయన ఒక ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌లో ట్రాఫిక్‌ అసిస్టెంట్‌.

ఈయన ఉద్యోగం చేసే సమయంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులతో మంచి పరిచయం. ఈ క్రమంలో టాలీవుడ్లో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న అల్లు అరవింద్ గారితో కూడా ఈయనకు మంచి పరిచయం ఏర్పడింది. ఉద్యోగంలో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడిన ఈయన నటనమీద ఉన్న ఆసక్తి వల్ల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కలిశారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ నటించిన హ్యాపీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

అప్పటి నుండి దాదాపు 30 వరకు సినిమాలలో నటించాడు. తర్వత బుల్లి తెరమీద దాదాపు 26 సీరియల్స్ లో నటించారు. పేర్రాజు తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవటానికి ఆయన వయసు అడ్డు రాలేదు. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రసారమౌతున్న ఈ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ ద్వారా పేర్రాజు గారికి కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ ఈ సీరియల్ నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అంటూ చెప్పుకొచ్చాడు.