NKR 21: క‌ళ్యాణ్‌రామ్ మూవీలో బాలీవుడ్ న‌టుడు.. లుక్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్!

NKR 21: తెలుగు ప్రేక్షకులకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్య కథలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు కళ్యాణ్ రామ్. అందులో భాగంగానే ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు కళ్యాణ్ రామ్. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NKR21 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ అంచనాలను పెంచుతూ ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుపుతూ తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన లుక్ ని రివీల్ చేశారు మూవీ మేకర్స్. నిజంగా అభిమానులకు ఇది సర్ప్రైజ్ అని చెప్పాలి. తాజాగా సోహెల్ ఖాన్ కి సంబంధించిన లుక్ ని రివ్యూ చేయగా ఆ ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇదే ఆయనకు మొదటి సినిమా కావడం విశేషం.

 

ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు సోహెల్ ఖాన్. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తోండ‌గా విజ‌య‌శాంతి, శ్రీకాంత్‌ లు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా చాలా వివరాలు తెలియాల్సి ఉంది.