KTR: మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే. ఈ రేసు ఫార్ములా విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఈయనపై కేసు నమోదు కావడంతో ఏ క్షణమైన ఈయన అరెస్ట్ కావచ్చు అనే తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో తీవ్ర ఉత్కంఠత కూడా నెలకొంది. ఈ క్రమంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది.
తనపై కేసు నమోదు కావడంతో తన పట్ల నమోదు అయిన ఈ కేసును కొట్టివేయాలి అంటూ ఈయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోర్టును ఆయన కోరారు.ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయగా ఇందులో ఏ వన్ ముద్దాయిగా కేటీఆర్ పేరును చేర్చింది.
A2గా ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, A3గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిగా పేర్కొన్నారు. ఇలా తన పట్ల ఏసీబీ కేసు నమోదు కావడంతో కేటీఆర్ అరెస్టు తప్పదని పలువురు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలోని ఈయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తరువాత ఈ పిటిషన్ విచారణ చేసిన అనంతరం కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియాల్సి ఉంది.
ఇక కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో బిఆర్ఎస్ నేతలు ఈ కేసును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కేవలం ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి పక్కకు మళ్ళించడం కోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు అదే విధంగా ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇలా అరెస్టులంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు.