చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో అ సమస్యలు దూరం!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తోంది. మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇతర కాలాలతో పోల్చి చూస్తే చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. చుండ్రు సమస్య వల్ల జుట్టు రాలడంతో పాటు దురద సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు. ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

వేపనీటితో జుట్టును శుభ్రం చేయడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది. జుట్టుకు పెరుగును అప్లై చేయడం ద్వారా కూడ చుండ్రు సమస్యను సులువుగానే దూరం చేసుకోవచ్చు. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. చుండ్రుకు చెక్ పెట్టడంలో అలోవేరా కూడా సహాయపడుతుంది. అలోవేరాలో నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేస్తే మంచిది.

బేకింగ్ సోడాను జుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మెంతులను పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఫంగల్ ఇన్​ఫెక్షన్లు, ఒత్తిడి, వయసు కూడా చుండ్రు సమస్యకు కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త షాంపూలను వాడటం వల్ల కూడా కొంతమంది చుండ్రు బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చలికాలంలో రోజూ తలస్నానం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ‘బి’, జింక్ వంటివి అధికంగా లభించే వాల్‌నట్స్, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే చహన్స్ అయితే ఉంటుంది.