RRR Documentary Release: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. 2022 మార్చి 24 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపుగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా విడుదల అయ్యి అక్కడ కూడా సంచలన విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమాకి తెరకెక్కించడం వెనుక ఎంతో కష్టపడ్డారు. దాదాపుగా మూడేళ్లపాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆస్కార్ అవార్డు అందుకోవడం వరకు ప్రతి ఒక విషయాన్ని ఆసక్తికరంగా ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ డాక్యుమెంటరీని రేపు అనగా డిసెంబర్ 20వ తేదీ నుంచి థియేటర్లలో విడుదల చేయబోతున్నారట మూవీ మేకర్స్. అయితే కేవలం మల్టీఫెక్స్ స్ర్కీన్‌లలోనే దీన్ని ప్రదర్శించనున్నారట. కాగా ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. బుక్ మై షోలో ఈ షోకి సంబంధించిన టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 1 గంటా 38 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలను చూపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.