Mohan Babu: మోహన్ బాబుకు తప్పని తిప్పలు.. ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు!

Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు ల గొడవలు నేపథ్యంలో మోహన్ బాబు ఎంటర్ అవ్వడంతో పాటు ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలి వానగా మారిన విషయం తెలిసిందే. నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయం కాస్త నడి వీధిలోకి వచ్చింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడం మరొక ఎత్తు అని చెప్పాలి.

ఈ ఘటనలో జర్నలిస్టు తీవ్రంగా గాయాల పాలవడంతో అతను ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనికి చిన్నపాటి ఆపరేషన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే మోహన్ బాబు పై కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మోహన్ బాబు హాస్పిటల్ కి వెళ్లి సదరు జర్నలిస్టుని పరామర్శించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా జర్నలిస్ట్ లపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి అప్లై చేయడంతో నేడు హైకోర్టు విచారణ జరిపింది. జర్నలిస్ట్ తరపున న్యాయవాది వాదిస్తూ.. అటెంప్ట్ టూ మర్డర్ కేస్ పెట్టడంతో హాస్పిటల్ లో ఉన్న జర్నలిస్ట్ ను మోహన్ బాబు కలిశాడు.

మోహన్ బాబు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. అరెస్టు భయంతో మోహన్ బాబు దుబాయి పారిపోయాడు అని సదరు జర్నలిస్ట్ న్యాయవాది ఆరోపించారు. దీనికి కౌంటర్ గా మోహన్ బాబు తరుపున వాదించిన న్యాయవాది.. మోహన్ బాబు దుబాయ్ పారిపోలేదు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా రిలీఫ్ ఇవ్వాలని అని కోరాడు. అయితే మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడు అన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని మోహన్ బాబు అడ్వకేట్ కు హై కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఈ విషయంలో మోహన్ బాబుకు గట్టి షాక్ తగిలినట్టు అయింది. అంతేకాకుండా ఈ కేసు విషయంలో ఆయనకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. కొడుకులు చేసిన పనికి మధ్యలో మోహన్ బాబు బలవుతున్నారని చెప్పాలి.