Samantha: సమంతకు బిగ్ షాక్… లీగల్ నోటీసులు ఇచ్చిన టాలీవుడ్ హీరో… సమంతకే ఎందుకిలా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడైతే ఈమె ప్రేమించిన వ్యక్తికి విడాకులు ఇచ్చిందో అప్పటినుంచి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అనంతరం మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు. ఇలా ఈ ఇబ్బందుల నుంచి బయటపడిన సమంతకు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని మరో షాక్ ఇచ్చారు.

ఇలాంటి తరుణంలోనే సమంత తండ్రి మరణం కూడా ఆమెకు కోలుకోలేని దెబ్బ కొట్టినదని చెప్పాలి. ఇలా సమంత పెద్ద ఎత్తున ఇబ్బందులను పడుతున్న తరుణంలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఈమెకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్టార్ హీరో ఎందుకు పంపించారని విషయానికి వస్తే ఈమె మయోసైటీసిస్ వ్యాధి రాకముందు ఆ హీరోతో ఓ సినిమాకి కమిట్ అయ్యారట అయితే ఈ వ్యాధి కారణంగా ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి సినిమాలలో కొనసాగుతున్నారు.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా సమంత గతంలో కమిట్ అయినటువంటి ఆ సినిమా కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోలేదట అందుకే తిరిగి ఆ సినిమాలో నటించాలని ఆ హీరో కోరారు అయితే సమంత మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపడం లేదని అందుకే ఆ హీరోతో కలిసి సినిమాలో నటించలేదని చెప్పడంతో ఏకంగా ఆ హీరో సమంతకు లీగల్ నోటీసులు పంపించారని తెలుస్తుంది. అయితే సమంత ఇదివరకు ఆ హీరోతో కలిసి ఓ సినిమాలో నటించి సందడి చేశారు. మరి సమంతకు ఆ హీరో లీగల్ నోటీసులు పంపించారని వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక సమంత అభిమానులు మాత్రం ఈమె వరసగా వివాదాలలో చిక్కుకోవడంతో సమంతకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.