ఈ మధ్య కాలంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య వల్ల ఇబ్బంది పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఎన్నో కొత్త ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్లను ఈ సమస్య వేధిస్తుంది. మసాలాలతో చేసిన వెంటకాలను తక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నీటితో అవిసె గింజలను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. పరగడుపున దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం ద్వారా కూడా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. రోజుకు ఒక యాపిల్ పండును తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను పెంచే ఛాన్స్ ఉంటుంది. డయాబెటిస్, హైపర్‌థైరాయిడిజం వంటి వ్యాధులు కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
గుండె జబ్బులు, స్ట్రోక్, పరిధీయ ధమనుల వ్యాధికి చెడు కొలెస్ట్రాల్ కారణమవుతుంది. బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉండే నైట్రేట్స్ అనే పదార్థాలు రక్తనాళాలను విశాలం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని చెప్పవచ్చు. బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు.