Bollywood: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లి కాకముందు వరకే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక్కసారి పెళ్లయి పిల్లలు పుట్టారు అంటే సినిమా అవకాశాలు రావడం చాలా వరకు తక్కువ అని చెప్పవచ్చు. కానీ బాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ మాత్రం పెళ్లయి తల్లి అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. కోట్లలో పారితోషికం అందుకుంటూ వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్.
మొదట స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత హిందీలో వరుస సినిమాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన మెప్పించింది అలియా భట్. గంగూబాయి కతియవాడి సినిమాలో తన నటనకు ఏకంగా జాతీయ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే. అలాగే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాది సినీ ప్రియులను కూడా అలరించింది.
అలియా భట్ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.18 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. అలాగే హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా కోసం $500,000 పారితోషికం తీసుకుంది. అలాగే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో చేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది ఆలియా భట్. కాగా అలియా ఆస్తులు రూ.550 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్ లు, బిజినెస్ వెంచర్ ల ద్వారా సంపాదిస్తోంది. అటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తూ దూసుకుపోతోంది. చిన్న పిల్లల దుస్తులు బ్రాండ్ ఎడ్ ఎ మమ్మను 2020లో స్థాపించింది. ఈ బిజినెస్ విలువ రూ.150 కోట్లు. అలాగే సొంతంగా ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కూడా కలిగి ఉంది. ముంబై, లండన్ లో ఖరీదైన భవనాలు ఉన్నాయి. BMW , రేంజ్ రోవర్‌తో సహా హై ఎండ్ కార్లను కూడా కలిగి ఉంది అలియా భట్. ఈ ముద్దుగుమ్మ రేంజ్ అలాగే ఆస్తులు విలువ తెలిసి అభిమానులు నోరెళ్ల బెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పెళ్లి అయినా కూడా అలియా భట్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.