తమిళనాడు విజయ్ తళపతి ద గోట్ సినిమాతో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా మనందరి ముందుకే వచ్చాడు. ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు విజయ్ తళపతి తను 69వ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండడం విశేషం. అనిరుద్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తూ ఉండగా పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు.
అలాగే తమిళ్ నాటి మమత బైజు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ కి సోదరిగా అనిపిస్తుందంట మమత. రాజకీయాలలోకి ప్రవేశించే ముందు తన ఆఖరి చిత్రంగా ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ 69వ చిత్రం తెలుగు సూపర్ హిట్ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రచన మరియు దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది.ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉండటంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లే విజయ్ నిజంగానే రీమేక్ రైట్స్ కొన్నాడు కానీ అఫీషియల్ గా రీమేక్ చేయడం లేదు. కొన్ని పాత్రలు ఒరిజినల్‌కు సిమిలర్ గా అనిపించాయి కాబట్టి మేకర్స్ ఎలాంటి సమస్యలు రాకుండా రైట్స్ కొనుగోలు చేసారు.
తళపతి 69 సినిమాలో విజయ్ కి మమతా బైజుకి మధ్యలో ఉండే రిలేషన్ ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఉండే రిలేషన్ లాంటిదే. రేపు కాపీ రైట్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే భగవంత్ కేసరి సినిమాలో కాజల్ క్యారెక్టర్ లాగే విజయ్ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ ఉంటుందట. అంతేకానీ సినిమా భగవత్ కేసరి సినిమాకి 69 పూర్తి రీమేక్ కాదు అంటున్నారు సినీ క్రిటిక్స్.