Game Changer: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలోకి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 10వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.. ఇప్పటికైనా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మూవీ మేకర్స్. హీరో రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను గట్టిగానే చేపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంచనాలను మరింత పెంచుతూ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ బరిలోకి దింపుతున్నారు దిల్ రాజు. చెర్రీ కోసం పవన్ కళ్యాణ్ రాబోతున్నారట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లోనే వేడుకకు ఏర్పాట్లు జరగనున్నట్లు టాక్. అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ప్రత్యేక బంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని పంచుతోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ ఈవెంట్ జనవరి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. చిరంజీవి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారట. ఇక వేడుకలో గేమ్ ఛేంజర్ గురించి పవన్ మాట్లాడితే, సినిమా పట్ల జనాల్లో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరైతే ఈ సినిమాపై హైట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.