కమెడియన్ లక్ష్మీపతి మీ అందరికీ గుర్తుండే ఉంటారు. యాంకర్ గా, సినిమా రైటర్ గా తనని తాను ప్రూవ్ చేసుకొని తరువాత చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీపతి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లరి సినిమా అతనికి కమెడియన్ గా మంచి క్రేజ్ తీసుకువచ్చింది. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్యనటుగా మంచి పేరు సంపాదించుకున్నారు లక్ష్మీపతి.
2000 నుంచి 2008 వరకు కమెడియన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా విలన్ గా దాదాపు 70 సినిమాల్లో నటించారు లక్ష్మీపతి. అయితే చేతినిండా ఆఫర్లతో కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో లక్ష్మీపతి గుండెపోటు కి గురై మరణించారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకులు టాలీవుడ్ లో క్రేజీ హీరోలు అన్న విషయం ఎంతమందికి తెలుసు. నిజమేనండి పేపర్ బాయ్ సినిమాతో హీరోగా అడుగుపెట్టిన సంతోష్ శోభన్ లక్ష్మీపతికి వరుసకి కొడుకు అవుతాడు. సంతోష్ శోభన్ తండ్రి డైరెక్టర్ శోభన్ లక్ష్మీపతికి స్వయంగా తమ్ముడు.
శోభన్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాకి డైరెక్టర్. ఆ సినిమా ప్రభాస్ కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈయన కూడా 2008లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయారు. అన్నదమ్ములిద్దరూ నెల రోజుల తేడాతో స్వర్గస్తులు కావడం విచారకరం. ఆ శోభన్ కొడుకులే సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. సంతోష్ శోభన్ ఇప్పటికే పేపర్ బాయ్, ఏక్ మినీ కధ,అన్ని మంచి శకునం లే వంటి సినిమాలలో నటించి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.
ఇక తమ్ముడు సంగీత్ శోభన్ ఈ మధ్యనే విడుదలైన సూపర్ హిట్ మూవీ మ్యాడ్ సినిమాలో ఒక హీరోగా నటించాడు ప్రస్తుతం మ్యాడ్ టు మూవీ లో నటిస్తున్నాడు. అయితే ప్రభాస్ కి వర్షం వంటి పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ కావటంతో అతని కెరియర్ డెవలప్ అవ్వటానికి ప్రభాస్ అండ్ యు వి క్రియేషన్స్ అతనికి చాలా సపోర్ట్ ఇచ్చింది. ఈ విషయం సంతోష్ శోభన్ స్వయంగా చెప్పటం విశేషం.