AP: పెన్షన్లు తీసుకునేవారు దొంగలే… స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!

AP: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఏపీలో పెన్షన్ల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి గత ప్రభుత్వ హయామంలో ఎంతోమంది తప్పుడు సర్టిఫికెట్లను పెట్టి దొంగ పెన్షన్లను తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇలా దొంగ పెన్షన్లు అన్నింటిని కూడా గుర్తించిందని రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు లక్షల 20వేల మంది అనర్హులు పెన్షన్ అందుకుంటున్నారని తెలియజేశారు.

ఇలా దొంగ సర్టిఫికెట్లతో వయసును పెంచుకొని మరి పెన్షన్ పొందుతున్నారు అలాగే తమకు ఎలాంటి లోపాలు లేకపోయినా డాక్టర్ నుంచి ఫేక్ సర్టిఫికెట్లను తీసుకువచ్చి పెన్షన్ అందుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇప్పటికే అనర్హుల జాబితాను గుర్తించామని వారందరికీ నోటీసులను కూడా జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఇలా ప్రతినెలా 3,20,000 మంది అనర్హుల పెన్షన్ అందుకోవటం వల్ల నెలకు రూ. 120 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నష్టం సంవత్సరానికి రూ. 1440 కోట్లు, ఐదేళ్లకు రూ. 7200 కోట్ల వరకు పెరుగుతుందని తెలిపారు.

ఇలా అనర్హత కలిగిన వారందరు తీసుకున్న ఈ పెన్షన్ తో రాష్ట్రానికి మూడు తాండవ రిజర్వాయర్లను నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు.దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారు దొంగలే అంటూ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ పెన్షన్ల గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించామని త్వరలోనే ఆయన స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉందని వెల్లడించారు.