బాలయ్య మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్.. ఈగర్ గా వెయిట్ చేస్తున్న డాకు మహారాజ్ ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు కొల్లి బాబి డైరెక్ట్ చేస్తుండగా నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రీ రిలీజ్ వేడుకలు అమెరికాలో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే మూవీ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో వరుస అప్డేట్స్ ఇస్తుంది చిత్ర యూనిట్. మొన్ననే ఫస్ట్ సింగిల్ ది రేస్ ఆఫ్ డాకు అనే పాటని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో దూసుకుపోతుంది. తాజాగా రెండో సింగిల్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్ ఈ మూవీ నుంచి చిన్ని అనే సెకండ్ సింగిల్ ని డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. సున్నితమైన గాలి, ఆ గాలిలో ఇంద్రజాలాన్ని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో బాలయ్య బాబుతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. పాపని బాలకృష్ణ స్కూల్ కి తీసుకు వెళ్తున్నట్లు చూపించారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు బాబి విభిన్నంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ సినిమానా అనే అనుమానాలు కలిగే విధంగా బాలకృష్ణను రెండు విభిన్నమైన గెటప్స్ లో చూపిస్తున్నారు. సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ సింగిల్ అందరూ హృదయాలని దోచుకుంది ఇక సెకండ్ సింగిల్ ఎలాంటి అరాచకాలు సృష్టిస్తుందో చూడాలి.