మరో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప 2 మూవీ.. 14 రోజుల్లోనే 1508 కోట్ల కలెక్షన్స్!

పుష్ప వన్ సినిమా హిట్ ఆయన దగ్గరనుంచి పుష్ప 2 సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలను నిజం చేస్తూ సినిమా విడుదలకి ముందే రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత మరిన్ని రికార్డులని తిరగ రాసింది. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లో కొల్లగొడుతుండడం విశేషం.

అత్యంత వేగంగా 500 కోట్లు, 1000కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 1500 కోట్ల మార్క్ విషయంలోనూ అదే రికార్డు క్రియేట్ చేసింది. 14 రోజుల్లోనే ఈ మార్క్ అందుకుందని మైత్రి మూవీ మేకర్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారిక రూల్ సాగుతోంది. పుష్ప 2 ది రూల్ ఇప్పుడు అత్యంత వేగంగా 1500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ.

14 రోజుల్లోనే 1508 కోట్లు వసూలు చేసింది అనే క్యాప్షన్ తో ఒక ట్వీట్ విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్ టీం. కమర్షియల్ సినిమాకు అర్థం మార్చేసిన పుష్ప టు బాక్సాఫీస్ దగ్గర చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1508 కోట్లు వసూలు చేసింది. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ మూవీ పుష్ప టు అనే క్యాప్షన్ తో కాసేపటి తరువాత మరొకటి వెయిట్ విడుదల చేసింది.

నిజానికి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 100 కోట్లు మార్కు దాటేసింది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన సమయానికి 800 కోట్ల మార్కు దాటేసింది.నిజానికి తెలుగు కంటే కూడా ఈ సినిమా హిందీలోనే ఎక్కువ వసూలు రాబట్టింది. ఇప్పటికే అక్కడ 600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. పుష్ప టు సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీ గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన స్త్రీ 2 రికార్డ్స్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేయడం విశేషం.