Allu Arjun: మెగా సంక్రాంతి సంబరాలకు దూరంగా అల్లు అర్జున్.. విభేదాలు తొలగిపోలేదా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొంతకాలంగా మెగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈయన నంద్యాలకు వెళ్లారో అప్పటినుంచి మెగా కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ దూరం పెట్టారు దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం భారీగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియ చేయకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడికి మద్దతు తెలపడమే అందుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ భారీగా వచ్చింది.

ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం తగ్గిందని తెలుస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో చిరంజీవి నాగబాబు వెంటనే అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం అల్లు అర్జున్ బయటకు రావడం కోసం ప్రయత్నాలు కూడా చేశారని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లి మరీ వారితో మాట్లాడి వచ్చారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పూర్తిగా పోయిందని తెలుస్తుంది.

ఇకపోతే ప్రతి ఏడు సంక్రాంతి పండుగను చిరంజీవి బెంగళూరులోని తన ఫామ్ హౌస్ లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ మూడు రోజులపాటు మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు మాత్రం అల్లు అర్జున్ వెళ్లలేదని తెలుస్తుంది. ఇలా వెళ్లకపోవడానికి కారణం ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ అలాగే ఉందా అంటే లేదనే తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ బెయిల్ మీద ప్రస్తుతం బయట ఉన్నారు అలాంటిది ఈయన హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు అలాంటిది బెంగళూరుకు వెళ్లడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వరు కనుక ఈయన సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.