YS Jagan: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు కార్యకర్తలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశంలో భాగంగా ఈయన కార్యకర్తలకు దిశా నిర్దేశాలు చేశారు. ఇక ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాలన గురించి అబద్ధపు హామీల గురించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయని విమర్శించారు జగన్.. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి.. మైనింగ్ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతి ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకు నీకింత నాకింత అనేది జరుగుతుందని జగన్ తెలియజేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి.
ఈ నెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం.. మళ్లీ జనవరి 3న ఫీజు రియింబర్స్‌మెంట్, వసతిదీవెన మీద చేస్తున్నాం.. ప్రజల తరఫున మనం నాయకులుగా ఎదుగుతాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కష్టాలు ఉంటాయి మనపై కేసులు పెడతారు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని జగన్ తెలిపారు. ఇక తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 నెలలపాటు జైల్లో ఉన్నాను.
ఇలా 16 నెలలలో నా భార్య 20 సార్లు బెయిల్ పిటీషన్ దాఖలు చేసింది కింద కాంగ్రెస్ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ కారణంగా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అయినా నేను ముఖ్యమంత్రిని కాలేదా?ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. ఎల్లకాలం కష్టాలు ఉండవు.. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఢీకొనేలా ఉండాలని తెలిపారు మీకు ఎవరికి కష్టం వచ్చినా ఒక్కసారి నా కష్టాన్ని గుర్తు చేసుకోండి. మీ అందరికీ అండగా నేనుంటా అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా నేతలను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.