బాక్సాఫీస్ : ‘RRR’ 80 రోజుల జపాన్ వసూళ్ల రికార్డులివే.!

1121107-rrr

గత ఏడాదికి బిగ్గెస్ట్ నేషనల్ సెన్సేషన్ హిట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే మన టాలీవుడ్ ప్రైడ్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). ఎన్టీఆర్ సహా రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన ఈ మాసివ్ అండ్ ఎపిక్ మల్టీ స్టారర్ ఇప్పుడు భారీ మొత్తంలో వసూళ్లతో ఆల్ టైం రికార్డులు అందుకుంది.

మరి ఇండియా లో సినిమా ఆల్ టైం రికార్డ్స్ సెట్ చేయగా గత కొన్ని నెలల కితమే జపాన్ దేశంలో కూడా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ కూడా ఆల్ టైం రికార్డు ఫస్ట్ వీక్ గ్రాస్ అందుకొని రికార్డు సెట్ చేసింది. అలాగే దీనితో ఈ చిత్రం అలా మొదటి రోజు కన్నా 10, 20 రోజుల తర్వాత కూడా అత్యధికంగా వసూలు చేసి అక్కడ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

ఇక అక్కడ ఈ చిత్రం విజయవంతంగా 80 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ 80 రోజుల్లో అయితే ఈ సినిమా 31.45 కోట్ల గ్రాస్ ని అందుకుంది. మరి ఇది జపాన్ కరెన్సీతో అయితే 505 మిలియన్ అట. ఇక ఈ సినిమా ఈ 80 రోజుల్లో మొత్తం 3 లక్షల 34 వేల టికెట్స్ అమ్ముడుపోగా ఇది కూడా ఒక రికార్డు అన్నట్టు తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం మాత్రం జపాన్ లో తగ్గేదెలే అన్నట్టుగా దుమ్ము లేపే రన్ ని అందుకుంది అని చెప్పాలి. ఇక అక్కడ కూడా 100 రోజుల మార్క్ కి వెళ్ళింది అంటే ఇది మరో రికార్డు అవుతుంది అని చెప్పొచ్చు.