Thandel Song: యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న నాగ చైతన్య బుజ్జి తల్లి సాంగ్.. ఈసారి హిట్ గ్యారెంటీ అంటూ!

Thandel Song: టాలీవుడ్ హీరో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మత్స్యకారుల బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కార్తికేయ 2 సినిమా తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి బుజ్జి తల్లి అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Bujji Thalli Lyrical | Thandel |Naga Chaitanya, Sai Pallavi | Javed Ali |Shree Mani |Devi Sri Prasad

ఈసారి తండేల్ సినిమాతో హిట్ గ్యారెంటీ హిట్టు కొట్టడం పక్క అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ కన్నడ తమిళం మలయాళం భాషల్లో 2025 ఫిబ్రవరి 7వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. డిసెంబర్ 28న ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేశారు మూవీ మేకర్స్. ఇందులో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీస్ సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..