అంచనాలని అందుకోలేకపోయిన బేబీ జాన్.. నిర్మాతగా చేతులు కాల్చుకున్న అట్లీ!

వరుణ్ ధావన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేబీ జాన్. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. వామికా గబ్బి మరొక హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకి కలీస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన తేరి సినిమాకి రీమేక్. తేరి సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించిన అట్లీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఐపీఎస్ ఆఫీసర్ సత్య ( వరుణ్ ధావన్ ) ముంబై రౌడీల ఆట కట్టిస్తూ ఉంటాడు, అలాగే నానాజీ ( జాకీ షరాఫ్ ) చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్లకి కూడా అడ్డుపడతాడు. సత్యా ని టార్గెట్ చేసిన నానాజీ అతని కుటుంబానికి ఎలాంటి ఆపద తలపెట్టాడు, సత్య భార్య మీరా( కీర్తి సురేష్) కి ఏమైంది, ముంబైని వదిలిపెట్టిన సత్య తన కూతురితో కేరళలో ఎందుకు సెటిల్ అయ్యాడు అనేదే ఈ సినిమా కథ.

అయితే 180 కోట్ల బడ్జెట్ తో, భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మూడు రోజుల్లో కేవలం 19 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఫస్ట్ డే తో పోలిస్తే మూడో రోజు కలెక్షన్స్ 70 శాతం వరకు డ్రాప్ అయ్యాయి. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా కేవలం 23.90 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమా మొత్తంగా 60 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేస్తుందని అంచనా.

దాంతో ఈ సినిమా ద్వారా నిర్మాతకు 100 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయింది. కలెక్షన్ డ్రాప్ చూస్తుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావటం కష్టమే అని ప్రచారం జరుగుతుంది. అయితే నిర్మాతగా మారిన అట్లీకి మొదటి ప్రయత్నంతోనే గట్టి దెబ్బ తగిలింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ సినీ వర్గం వారు.