Mohanlal: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సరసన యంగ్ హీరోయిన్లు నటించడం అన్నది కామన్. ఇప్పటికే ఇలా సీనియర్ హీరో యంగ్ హీరోయిన్ల కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ కొన్ని సినిమాలలో మాత్రం హీరోకి హీరోయిన్ కూతురులా ఉంది అంటూ భారీగా ట్రోలింగ్స్ కూడా జరిగాయి. ఆ సంగతి పక్కన పెడితే సీనియర్ హీరోల సరసన యంగ్ హీరోయిన్ లు తప్పు కాదు అంటున్నారు నటుడు మోహన్ లాల్.
మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఈ విషయం గురించి స్పందిస్తూ.. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీ ఇలాగే ఉంది. తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో కూడా ఇదే కొనసాగుతోంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద ఏళ్లు వచ్చినా సరే యాక్ట్ చేయవచ్చు. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నావనేది నీ చేతిలో ఉంటుంది. నీకు అసౌకర్యంగా అనిపిస్తుందంటే అలాంటి అవకాశాలను వదిలేసుకోవడమే మంచిది. కానీ జనాలు మిమ్మల్ని ఆయా పాత్రల్లో ఇష్టపడుతుంటే వాటిని అంగీకరించడంలో తప్పేం లేదు.
యాక్టింగ్ అనేది ఒక పర్ఫామెన్స్ అంతే! దానికి వయసుతో సంబంధం లేదు. కేవలం అక్కడ ఎటువంటి పాత్ర చేస్తున్నావన్నది నీపై ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చారు మోహన్‌లాల్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఈ విషయంపై నెగటివ్ గా స్పందిస్తున్నారు. ఇకపోతే మోహన్‌లాల్.. విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు,తమిళం భాషల్లో వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు..