విజయవాడలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అతని భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఆ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు పాల్గొని సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చాలనే ఇచ్చారు. సినిమా విడుదల కి ఇంకా 15 రోజులు కూడా లేదు, అయినా ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం పట్ల ఫాన్స్ గరం గరం గా ఉన్నారని దిల్ రాజు కి తెలుసు అందుకే సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ ట్రైలర్ నా ఫోన్లోనే ఉంది కానీ అది మీ వరకు రావాలంటే ఇంకా చాలా వర్క్ జరగాలి.
జనవరి 1న సినిమా ట్రైలర్ ని మీ ముందుకు తీసుకు వస్తాం అని చెప్పాడు దిల్ రాజు. ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరుగుతున్నాయని, ఆయన ఇచ్చే డేట్ ని బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరపాలి అనేది ప్లాన్ చేసుకుంటామని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యే ఆ ఈవెంట్ మామూలుగా ఉండదు, ఈవెంట్ తో ఒక చరిత్ర క్రియేట్ చేయాలి అన్నారు దిల్ రాజు.
ఇక సినిమా విషయానికి వస్తే సినిమా చూస్తున్నంత సేపు పరిగెడుతూనే ఉంటుంది, ఏ సీను కూడా నిరాశపరచదు సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. ఎస్ జె సూర్య, రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు థియేటర్లో దద్దరిల్లుతాయి. మీరంతా జనవరి 10న రాంచరణ్ నట విశ్వరూపం చూస్తారు. కొంతసేపు పోలీస్ ఆఫీసర్‌గా, ఇంకొద్ది సేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. శంకర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటుంది.
2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిడివి విషయంలోనూ శంకర్ గారితో మాట్లాడాను. అంతే నిడివిలో శంకర్ గారు అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు. సినిమా చూసిన చిరంజీవి గారు నేను ఇక్కడకు వచ్చిన వెంటనే ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు అని ఫ్యాన్స్‌కు చెప్పండి అని చిరంజీవి గారు అన్నారు. సినిమా గురించి దిల్ రాజు ఒక్కొక్క అప్డేట్ ఇస్తుంటే పూనకాలతో ఊగిపోవటం ఫాన్స్ వంతయ్యింది.