తల్లిదండ్రుల కంటే వాళ్లే ఎక్కువ.. యష్ తో పెళ్లికి కారణాలు చెప్పిన సోనియా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన సోనియా అంతకుముందు ఆర్జీవి దర్శకత్వం వహించిన ఒకటి రెండు సినిమాలలో నటించింది. ఆ గుర్తింపు తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. షో మొదటి వారంలోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది కానీ నిఖిల్, పృథ్వీలతో స్నేహం విపరీతమైన నెగిటివిటీని తీసుకురావడంతో ఆమె నాలుగో వారంలోనే హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. తర్వాత తన ప్రియుడు యష్ ని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.

యష్ కి ఇది రెండో పెళ్లి. అయినా అతడినే పెళ్లి చేసుకోవడానికి దారితీసిన విషయాలు చెప్పింది సోనియా. యష్‌కి ముందే పెళ్లయినప్పటికీ మొదటి భార్యకి విడాకులు ఇచ్చారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అతను యష్‌తోనే ఉంటాడు. ఆ అబ్బాయిని సోనియా స్వీకరించింది. తాను చూసుకునేందుకు ఒప్పుకుంది. దాంతో యష్‌ ఫ్యామిలీకి మరింత దగ్గర అయింది సోనియా. సోనియా ప్రారంభించిన ఎన్జీవోకి యష్‌ డిజైనర్ గా, స్పాన్సర్‌గా వ్యవహరించారు.

ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్‌ అయ్యారు. యష్‌ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు డ్రీమ్‌ హౌజ్‌ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్‌గా బ్యాలెన్స్ రావాలని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అనే డ్రీమ్ ఉండేదట. వాటిలో యష్ పాత్ర చాలా ఉండేదని, యష్‌ తనకి తానని కొత్తగా పరిచయం చేశాడని,

తనకి ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చాడని, యష్ తనని చాలా స్ట్రాంగ్ గా మార్చేశాడని తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. పెళ్లి విషయంలో తన తల్లి తండ్రులకి ఆప్షన్ లేదని, తను ఏది చెప్తే తల్లిదండ్రులు దానికి ఓకే అంటారని కానీ యష్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్ళికి అంగీకరించడం గ్రేట్, తనంటే తన మామయ్యకి బాగా నమ్మకం అని తన తల్లిదండ్రుల కంటే ఆ అంకులే ఎక్కువ బలం అని చెప్పుకొచ్చింది సోనియా.

Yash Soniya Family Vlog | Yash Veeragoni | Soniya Akula | Yours Soniya | Indian Wedding | Biggboss