మన శరీరంలో వేడి పెరిగితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేసవికాలంలో ఈ వేడి వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గించవచ్చు. డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో పుచ్చకాయ ఎంతో సహాయపడుతుంది. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తినడం ద్వారా శరీరంలో వేడిని తగ్గించవచ్చు.
కొబ్బరినీళ్లు శరీరంలోని వేడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరాన్ని చల్లగా ఉంచేలా చేయడంలో అలోవేరా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. బటర్ మిల్క్ తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరాన్ని ఎనర్జీతో ఉండేలా చేయడంలో తోడ్పడతాయి.
వేసవి కాలంలో సిట్రస్ పండ్లు శరీరానికి చలువ చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. శరీరానికి ఎనర్జీ ఇవ్వడంలో ఇవి తోడ్పడతాయని చెప్పవచ్చు. వేసవికాలంలో పచ్చని కూరగాయలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పుదీనా, ఉల్లిపాయలు శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పవచ్చు.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా శరీరంలో వేడిని సులువుగా తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గించే సూపర్ చిట్కాలను పాటించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.