Deepika Padukone: కల్కి 2 సినిమా షూటింగ్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన దీపికా.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ!

Deepika Padukone: నాగ్ అశ్విన్ దశకత్వంలో ప్రభాస్ దీపికా పదుకొనే కలిసిన నటించిన కల్కి. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కోట్లల్లో కలెక్షన్స్ సాధించడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుంది అని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా కల్కి 2 ఫై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని, హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నబోతున్నారు అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ వార్తలపై దీపికా పదుకొనే స్పందించారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. నా కుమార్తెను నేనే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను. మా అమ్మ నన్ను ఎలా అయితే చూసుకున్నారో అదే విధంగా నా పాపను నేను చూసుకోవాలనుకుంటున్నాను. తన ప్రతిక్షణాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను అని ఆమె తెలిపారు. అంటే తాను కల్కి 2 సినిమా షూటింగ్లో పాల్గొనలేదని, ఇప్పుడే షూటింగ్లో పాల్గొనను అని ఇండైరెక్టుగా హింట్ ఇచ్చింది. కాగా ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపిక పదుకొనే మాటలపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాగా కల్కి పార్ట్‌ 2 షూట్‌ గురించి ఇటీవల నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ స్పందించారు. కల్కి పార్ట్‌ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్‌ షూట్‌ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్కి 2898 ఏడీ సినిమాలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్‌ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనున్నారు అని తెలీపారు. దానికి తోడు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా బోలెడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.