మనలో చాలామంది వాస్తును నమ్ముతారనే సంగతి తెలిసిందే. వాస్తు విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ధనాన్ని ఆకర్షించవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని చిట్కాలను పాటిస్తే జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి ప్రవేశ ద్వారాన్ని కచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రవేశ ద్వారం ముందు పూల గింజలు, మంచి నీళ్లను ఉంచుకోవచ్చు.
ఇంటి వాయు మండలం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ధనాన్ని వాయు ప్రవాహం ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంటిలో పచ్చని అలంకరణ ఉన్న పువ్వులను ఎక్కువగా ఉపయోగించాలి. ఇవి వాడటం వల్ల ఇంటికి వాస్తు పరంగా మేలు చేకూరుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇంట్లో కూలర్ లేదా ఫిష్ ట్యాంక్ లను ఏర్పాటు చేసుకున్న వాళ్లు వాటిని శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారానికి స్వస్తిక్ చిహ్నం ఉంటే ఆ చిహ్నం ధనాన్ని ఆకర్షించేలా చేస్తుందని చెప్పవచ్చు. ఇంట్లో దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇంటి ఈశాన్యంలో మంచి వాతావరణం ఉండేలా చూసుకుంటే ఐశ్వర్యం అంతకంతకూ పెరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఇంట్లో సువర్ణ రూపాలు, రత్నాలు ఉంచడం వల్ల ధనాన్ని ఆకర్షించడం సాధ్యమవుతుంది. ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా లక్షాధికారులు అయ్యే ఛాన్స్ ఉంటుంది.