Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన తండ్రి వెంకటరావు వెంకటరావు వర్ధంతి సందర్భంగా తండ్రికి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఇంట్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. చిరంజీవి తన తల్లి అంజనమ్మ అలాగే సతీమణి సురేఖ,నాగబాబు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. జన్మనిచ్చిన మహనీయుడిని ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ.. అనే క్యాప్షన్ ని కూడా జోడించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ పై మెగా అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తూనే గెట్టి పోటీని కూడా ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందులో భాగంగానే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ… 🙏🙏 pic.twitter.com/MKxIw57pBZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2024
అలాగే ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మెగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారట మూవీ మేకర్స్. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..