Kannappa: భక్త కన్నప్ప నుంచి మరో అప్డేట్.. మూవీఫై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్న మంచు విష్ణు?

Kannappa: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం భక్తకన్నప్ప. ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మంచి విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో నటించే ఒక్కొక సెలబ్రిటీ కి సంబంధించిన లుక్ ని రివీల్ చేస్తూ మూవీపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు మంచి విష్ణు.

అయితే ఇప్పటికే చాలా అప్డేట్లను విడుదల చేసిన మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ లుక్ కు సంబంధించిన ఫోటో ని షేర్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్‌ లుక్‌ ను చిత్ర బృందం షేర్‌ చేసింది. ఇందులో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారని తెలిపింది. అందంలో సహజం!! తెగింపులో సాహసం! ప్రేమలో అసాధారణం! భక్తిలో పారవశ్యం! కన్నప్పకి సర్వస్వం! చెంచు యువరాణి నెమలి! అని టీమ్‌ పేర్కొంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకున్న మంచు విష్ణు నెమ్మది నెమ్మదిగా ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌ తో పాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌ లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విష్ణు, మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, ముఖేశ్‌ రిషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరుల పోస్టర్లు ఇప్పటికే రిలీజ్‌ చేసారు మూవీ మేకర్స్.