Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగవ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ షోకి హాజరయ్యారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. వెంకీ మామ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి సైతం బాలయ్య షోలో సందడి చేశారు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ షో కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే ఈ షో కి హాజరు కాబోతున్నారు చెర్రీ. రేపు అనగా డిసెంబర్ 31న ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులు ఈ వార్తపై స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా ఇది అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పాలి.
ఒకవేళ ఇదే గనుక నిజమైతే చెర్రీ అభిమానులకు ఇక పండగే పండగ అని చెప్పవచ్చు. ఇకపోతే రామ్ చరణ్ విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం చెర్రీ తో పాటు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.