Actress: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు వారికి సంబంధించిన ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. అలా తాజాగా కూడా బాలీవుడ్ ప్రముఖ నటి అతిగా శెట్టి అభిమానులకు ఒక శుభవార్తను తెలిపింది. అదేమిటంటే బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ శుభవార్తను తన అభిమానులతో షేర్ చేసుకుంది అతియా శెట్టి.
2025లో మన జీవితంలోకి కొత్త అతిథి వస్తాడు అంటూ ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అతియా. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అతియా బేబీ బంప్ తో కనిపించింది. ఈ వీడియోలో ఆమెతో పాటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి కూడా కనిపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ ల సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లకు మద్దతుగా అతియా శెట్టి, అనుష్క ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు.
Anushka Sharma and Athiya Shetty meet with Nitish Reddy’s father at MCG.#AUSvIND #INDvsAUS #MCG #nitishreddy#anushkasharma#athiyashettypic.twitter.com/M21afMwpIm
— RAJASTHANI MAN (@rajasthaniman1) December 29, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అతియా, అనుష్క మెల్బోర్న్ స్టేడియం నుండి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ క్యాజువల్ డ్రెస్సుల్లో తళుక్కుమన్నారు. మెల్ బోర్న్ మ్యాచ్ సందర్భంగా అనుష్క, అతియా శెట్టి నితీష్ రెడ్డి తండ్రిని కలిశారు. కాగా అతియా శెట్టి, కెఏ రాహుల్ 2023 లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి ముందు అతియా రాహుల్ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న విషయం తెలిసిందే. అతియా, రాహుల్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. అలా వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ఇప్పుడు త్వరలోనే తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు..