ఈ మధ్య కాలంలో చాలామంది పాదాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాదాలకు సరైన రీతిలో మర్ధనా చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. పాదాలకు నెయ్యితో మసాజ్ చేస్తే ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పాదాలకు మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అయితే అన్నీఇన్నీ కావు. నెయ్యిలో పాదాలకు మసాజ్ చేయడం ద్వారా మలబద్ధకం సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంది.
నెయ్యితో మసాజ్ వల్ల కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, పాదాల నొప్పులు దూరమవుతాయని చెప్పవచ్చు. ప్రశాంతమైన నిద్రను కోరుకునే వాళ్లు పాదాలకు నెయ్యితో మర్ధనా చేస్తే మంచిది. మర్ధనా చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని చెప్పవచ్చు. నెయ్యితో మర్ధనా చేయడం వల్ల పాదాలకు రక్త ప్రసరణ మెరుగుపడి గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చు.
నెయ్యితో నాభిపై మసాజ్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు. తెలుగింటి విందు భోజనాల్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆయుర్వేదంలో నెయ్యిని విస్తృతంగా వినియోగిస్తారు. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, మరికొన్నిసార్లు అజీర్ణం నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా ఎన్నో రకాలుగా నెయ్యి తోడ్పడుతుందని చెప్పవచ్చు.
నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉపయోగపడతాయి. నెయ్యి జీర్ణవ్యవస్థను లూబ్రికేట్ చేయడంతో పాటు మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుందని చెప్పవచ్చు. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. చర్మ గాయాలను త్వరగా నయం చేసి, సౌకర్యాన్ని నెయ్యి అందిస్తుంది.