Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల మురళీమోహన్ మనవరాలు రాగ టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహాల పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకలు పాల్గొన్నారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఈ పెళ్లి వేడుక గురించి స్పందించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమౌళి కోడలు పూజా, రాగ మంచి ఫ్రెండ్స్. వీలు కుదిరినప్పుడు రాగ వాళ్లింటికి వెళ్లేదది. ఈ క్రమంలో కీరవాణి, రాజమౌళి కుటుంబాలు ఎంత బాగా కలిసి ఉంటున్నాయో ఆమె చూసేది. ఇక చిన్నప్పటి నుంచి రాగకు ఉమ్మడి కుటుంబాలు ఎంతో ఇష్టం ఉండడంతో వారి కుటుంబాన్ని ఎంతో ఇష్టపడింది. ఒక శ్రీసింహాకు రాగనే ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని మొదట్లో మాకు చెప్పలేదు. ఒకసారి మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు నీకు నచ్చినవాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగాము. అప్పుడు తన మసులోని మాట బయటపెట్టింది. కీరవాణి కుమారుడు శ్రీసింహను ఇష్టపడ్డాను మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.
మా ఫ్యామిలీ అంతా ఓకేం చెప్పాము అని చెప్పుకొచ్చారు మురళీమోహన్. అలాగే పెళ్లిలో రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యుల చొరవ చూసి ఎంతో ముచ్చేసిందని అన్నారు. సాదారణంగా వధువు తరుపు వారు పల్లకిమోస్తూ మండపానికి తీసుకువెళ్లాలి. అయితే కీరవాని పెద్ద కొడుకు కాలభైరవతో పాటు మిగిలిన వారంతా కలిసి రాగను పల్లకిని పై మోసుకెళ్లారరు.. దీన్ని చూసి ఎంతో సంతోషమేసిందని అని అన్నారు మురళీమోహన్. ఈ సందర్భంగా మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.