Game changer: రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలు కూడా అదే విధంగానే ఉన్నాయి. ఇక శంకర్ డైరెక్షన్లో సినిమా అంటే సినిమాపై పూర్తిస్థాయిలో అంచనాలు ఉంటాయని సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్ డైరెక్షన్ అంటే కచ్చితంగా సినిమాలలో ఆయన తన మార్క్ చూపిస్తారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ కోసం పెద్దపెద్ద సెట్లు వేయటం విదేశాలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు.
గతంలో కూడా ఈయన తన సినిమాల పాటల షూటింగ్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమాలోని పాటల కోసం కూడా ఈయన భారీ స్థాయిలో ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో కేవలం పాటల షూటింగ్ కోసం మాత్రమే ఈయన 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ పాటల కోసం ఖర్చు చేసిన డబ్బుతో ఒక మీడియం రేంజ్ హీరోతో పూర్తిస్థాయిలో సినిమా చేయొచ్చు కదా అంటూ కామెంట్లో చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో జరగండి అని ఒక్క పాట కోసమే ఏకంగా 16 కోట్ల రూపాయలతో సెట్ వేశారంటేనే ఈయన ఏ రేంజ్ లో పర్ఫెక్షన్ కోరుకుంటారో స్పష్టమవుతుంది. ఏది ఏమైనా పాటలకే 75 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి